calender_icon.png 31 October, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పెరుగుతున్న పుత్తడి

22-06-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూన్ 21: కొద్ది రోజులుగా దిగువస్థాయిలో ఉన్న బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కె ట్లో ధర పుంజుకున్న కారణంగా హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారె ట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.810 పెరి గి రూ.73,250 స్థాయికి చేరింది. గురువారం రూ.220 మేర పెరగ్గా, మొత్తం ఈ రెండు రోజుల్లో రూ.1,000కుపైగా పుత్తడి ధర ఎగిసింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులం ధర రూ.750 పెరిగి రూ. 67,150 వద్దకు చేరింది. మే నెల మూడోవారంలో స్థానిక మార్కెట్లో  పసిడి రూ.75,160 స్థాయి కి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.

అటుతర్వాత క్రమేపీ రూ.71,000 స్థాయికి పడిపోయిన విషయం విదితమే. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది రెండు దఫాలు వడ్డీ రేట్లు తగ్గించవచ్చంటూ తాజాగా అంచనాలు ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 30 డాలర్లకుపైగా ఎగిసి 2,370 డాలర్ల వద్దకు చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సభ్యులు చేసే ప్రకటనలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల్ని బులియన్ ట్రేడర్లు ఎప్పటి కప్పుడు గమనిస్తున్నారని అబాన్స్ హోల్డిం గ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు.

రూ.1,400 పెరిగిన వెండి

బంగారం బాటలోనే వెండి ధర సైతం పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర శుక్రవారం రూ. 1,400 అధికమై రూ. 98,500 వద్దకు చేరింది. గత నెలలో ఈ లోహం రూ. 1,02,000 స్థాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లో తాజాగా వెండి ఔన్సు ధర 30 డాలర్ల ఎగువన ట్రేడవుతున్నది. 

రూపాయి ఎఫెక్ట్

ప్రపంచ మార్కెట్లో బుధవారం బంగా రం, వెండి ర్యాలీ జరపడానికి తోడు రూపా యి విలువ గణనీయంగా తగ్గినందున ఈ రెండు లోహాల ధరలు స్థానికంగా ధరలు స్థానికంగా ఎక్కువ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గత నెలలో బంగారం ధర 2,370 డాలర్ల వద్ద ఉన్నపుడు, స్థానికంగా ఈ ధర రూ.72,900 సమీపంలో ఉండగా, ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో 2,370 డాలర్ల వద్దే ఉన్నప్పటికీ, ఇక్కడ 73,000 స్థాయిని అధిగమించడానికి రూపాయి పతనమే కారణం. డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి 83.60 సమీపంలో ఉన్నది.