calender_icon.png 23 December, 2024 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురుచికి పసిడి

21-12-2024 01:00:36 AM

న్యూఢిల్లీ:  67వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హర్యానా యువ షూటర్ సురుచి మూడు స్వర్ణ పతకాలతో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సురుచి పసిడి పతకాలు సొంతం చేసుకుంది. కర్ణీ సింగ్ రేంజ్ స్టేడియంలో జరిగిన మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 243.1 పాయింట్లు స్కోరు చేసి తొలి స్థానంలో నిలిచింది. జూనియర్ ఫైనల్లో చంఢీగర్ షూటర్ సైన్యం నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ 245.1 పాయింట్లు స్కోరు చేసిన సురుచి 3.4 పాయింట్ల తేడాతో పసిడి సొంతం చేసుకుంది. ఇక చివరగా జరిగిన యూత్ ఫైనల్లోనూ 245.5 పాయింట్లు స్కోరు చేసిన సురుచి మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది.