టిరానా (అల్బనియా): అండర్ -23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు పతకాలతో సత్తా చాటారు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో చిరాగ్ చిక్కారా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. కిర్గిస్థాన్‌కు చెందిన కరచోవ్‌తో జరిగిన హోరాహొరి పోరులో చిరాగ్ 4-3 తేడాతో చిత్తుగా ఓడించాడు. కాగా అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మూడో రెజ్లర్‌గా చిరాగ్ నిలిచాడు.
పురుషు ల విభాగంలో అమన్ షెరావత్ అనంతరం అండర్-23లో పతకం సాధించిన రెండో రెజ్లర్‌గాను నిలిచాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 9 పతకాలు గెలుచుకోగా.. ఇందులో ఒక స్వర్ణం, రజతం ఉండ గా.. మిగిలిన ఏడు కాంస్యాలు. సోమవారం పురుషుల ఫ్రీస్టుల్ విభాగంలో మరో రెండు కాంస్యా లు రాగా.. పతకాల పట్టికలో 82 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇరాన్ (158), జపాన్ (102), అజర్‌బైజన్ (100) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.