calender_icon.png 8 January, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనన్యకు స్వర్ణం

01-01-2025 12:00:00 AM

భోపాల్: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహారాష్ట్ర యువ షూటర్ అనన్య నాయుడు స్వర్ణంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో 252.5 పాయింట్లు స్కోరు చేసి పసిడి నెగ్గింది. రైల్వేస్ సీనియర్ షూటర్ మేఘన సజ్జనార్ (252.3 పాయింట్లు), నర్మదా నితిన్ (తమిళనాడు) 231.3 పాయింట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ ఈవెంట్‌లో గౌతమి భానోత్ (251.5 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకుంది.