calender_icon.png 18 January, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరిగి రూ.81,000 దాటిన బంగారం

18-01-2025 01:39:01 AM

హైదరాబాద్‌లో మరో రూ.650పెరిగిన తులం ధర

హైదరాబాద్, జనవరి 17: అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింత ఎగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం తులం ధర మరో రూ. 650 పెరిగి పలువారాల తర్వాత 24 క్యారెట్ల బంగారం  తిరిగి రూ.81,000  స్థాయిని అధిగమించింది. రూ. 81,270 వద్ద నిలిచింది.

ప్రపంచ మార్కెట్లో ధర అధికం కావడంతో స్థానికంగద పుత్తడి ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెపుతున్నారు.  హైదరాబాద్‌లో  22 క్యారెట్ల ఆభరణాల బంగా రం 10 గ్రాముల ధర మరో  రూ.600 ఎగి సి రూ.74,500 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ రెండు నెలల గరిష్ఠస్థాయి 2,715 డాలర్ల స్థాయికి పెరిగింది. హైదరాబాద్‌లో పసిడిబాటలోనే వెండి కూడా ఎగిసింది. ఈ లోహం కేజీ ధర రూ.1,000 పెరిగి రూ. 1,04,000 వద్ద నిలిచింది.