calender_icon.png 26 December, 2024 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు చైన్ చోరికి యత్నం

25-12-2024 07:28:51 PM

పెబ్బేరు,(విజయక్రాంతి): మహిళా మెడలో ఉన్న బంగారు చైన్ చోరికి గుర్తు తెలియని వ్యక్తి పాల్పడిన సంఘటన పెబ్బేరు మున్సిపాలిటీలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారంగా...పెబ్బేరు మున్సిపాలిటీ 3వ వార్డుకు చెందిన పండ్ల వ్యాపారి తెలుగు చిన్న పెంటమ్మ తన ఇంటి దగ్గర పండ్లు తోపుడు బండిపై పండ్లు పెడుతున్న క్రమంలో వెనుకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తి మెడలో ఉన్న పుస్తెల తాడును చోరీ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమతమైన మహిళా గట్టిగా కేకలు వేయడంతో తన భర్త సుల్తాన్, చుట్టు పక్కల వాళ్ళు వచ్చేలోపు బంగారు చైన్ వదిలి దొంగ పరరైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలు, రాత్రిళ్లు తేడా లేకుండా వరుసగా దొంగలు చోరీలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.