28-02-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గోల్డ్ కార్డ్’ వీసా భారత గ్రాడ్యుయేట్లకు వరంలా మారనుంది. ఎందుకంటే కొత్తగా గోల్డ్ కార్డ్ పౌరసత్వం తీసుకున్న వారికి అమెరికా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌కు అవకాశం కల్పించనున్నాయి. దీనిద్వారా అమెరికాలోని యునివర్సి టీల్లో చదివే భారత గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకునే అవకాశం కలుగుతుందని ట్రంప్ తెలిపారు.
ఎవరైనా సరే 50 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 43.5 కోట్లు) ఖర్చు చేసి ఈ కార్డును తీసుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న విదేశీ పెట్టుబడిదారులకు యూఎస్ పౌరసత్వాన్ని అందించే ఈ కొత్త వీసా పాలసీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సరిగా లేదని.. టాలెంట్‌తో పనిచేసేవారికి ఇది ఇబ్బందిగా మారిందన్నారు. అందుకే గోల్డ్ కార్డ్ వీసా తీసుకొచ్చామని.. దీనిద్వారా భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే మల్టీ టాలెంటెడ్ ఉద్యోగులు యూఎస్‌లో ఉండడానికి పని చేయనుందని వివరించారు.