calender_icon.png 23 January, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరిగి రికార్డుస్థాయికి పసిడి

23-01-2025 01:25:02 AM

  • హైదరాబాద్‌లో రూ.82,000 దాటిన బంగారం

మరో రూ.860 పెరిగిన తులం ధర

హైదరాబాద్, జనవరి 22: అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధర  రికార్డుస్థాయికి ఎగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల బంగారం తులం ధర మరో రూ. 860 పెరిగి పలువారాల తర్వాత 24 క్యారెట్ల బంగారం  తిరిగి రూ.82,000  స్థాయిని అధిగమించింది. రూ. 82,090 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్లో ధర అధికంకావడంతో స్థానికంగద పుత్తడి ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెపుతున్నారు. 

హైదరాబాద్‌లో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో  రూ.750 ఎగిసి రూ.75,250 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ మూడు నెలల గరిష్ఠస్థాయి 2,745 డాలర్ల స్థాయికి పెరిగింది. హైదరాబాద్‌లోవెండి కేజీ ధర మాత్రం స్థిరంగా రూ.1,04,000 వద్ద నిలిచింది.

యూఎస్ కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేపట్టే వాణిజ్య విధానాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తాయన్న భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనంగా పరిగణించే బంగారంలోకి పెట్టుబడులు మళ్లించడంతో పసిడి పెరుగుతున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ సౌమిల్ గాంధి చెప్పారు.