- హైదరాబాద్‌లో నేడు పెరిగే అవకాశం
- ఈసీబీ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం
హైదరాబాద్, సెప్టెంబర్ 12: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) మరో దఫా వడ్డీ రేట్లను తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో గురువారం రాత్రి బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరింది. ఔన్సు పసిడి ధర భారీగా 40 డాలర్ల వరకూ పెరిగి 2,582 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత కలిగిన పుత్తడి ఫ్యూచర్ కాంట్రాక్టు ధర రూ.880 మేర పెరిగింది.
ఈ ప్రభావంతో దాదాపు ఈ స్థాయిలో శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరగవచ్చని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో 24 క్యారట్ల తులం పసిడి ధర రూ. 73,150 వద్ద నిలిచింది. 22 క్యారట్ల ధర రూ.67,050 వద్ద ఉన్నది. రెండు నెలల క్రితం 0.25 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించిన ఈసీబీ తాజాగా మరో పావు శాతం తగ్గించి రేటును 3.5 శాతానికి దించింది.