calender_icon.png 26 October, 2024 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ ధరకే బంగారమంటూ..

19-06-2024 12:40:47 AM

మోసాలకు పాల్పడిన ముఠా 

ఏపీకి చెందిన నలుగురు నిందితుల అరెస్టు 

రూ.6.86 కోట్ల నకిలీ నగదు, 5 కిలోల నకిలీ బంగారం, రూ. 51 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి మంగళవారం విలేకరుల సమావే శం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఏపీకి చెందిన నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా సభ్యులు మొదట కస్టమర్లను నమ్మించడానికి ఒరిజనల్ బంగారాన్ని ఇచ్చి, ఆ తర్వాత బాధితులు పెద్ద మొత్తంలో బంగా రం కావాలని డబ్బులు చెల్లించిన తర్వాత వారికి నకిలీ బంగారాన్ని అప్పజెప్పి తప్పించుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కానిస్టేబుల్ వేషధారణలో ఓ వ్యక్తి ప్రవేశించి వారిని భయభ్రాంతులకు గురిచేస్తాడు. కేసు లు పెట్టి జైలుకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగుతాడు. 

మోసం వెలుగులోకి వచ్చిందిలా..

హైదరాబాద్‌కి చెందిన దిలీప్ బర్ఫా(38) అనే వ్యక్తి  బోడుప్పల్ ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు  సింగిరెడ్డి సురేశ్ ద్వారా ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు తక్కువ ధరకు బంగారం విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. ఈ మేరకు మే 19న ఇద్దరు కలిసి బెంగళూరులోని టీసీ పాళ్యకు వెళ్లి కర్రెద్దుల విజయ్‌కుమార్, హరీశ్ అనే ఇద్దరిని కలిశారు. మొదటగా దిలీప్‌బర్ఫా నుంచి రూ. 6 లక్షలు తీసుకొని 81 గ్రాముల బంగారం ఇచ్చారు. నాలుగు రోజుల తర్వాత హరీశ్ హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కి వచ్చి అదనంగా 20 గ్రాముల బంగారాన్ని ఇచ్చాడు. వారిని నమ్మిన దిలీప్ మరో 2 కిలోల బంగా రం కావాలని వారికి రూ.20 లక్షలు చెల్లించాడు. బంగారం తీసుకోవడానికి మే 29న సురేశ్‌తో కలిసి బెంగళూరు టీసీ పాళ్యకు వెళ్లగా.. వారి సమక్షంలోనే కర్రెద్దుల విజయ్‌కుమార్ 5 కిలోల బంగారాన్ని ఇతరులకు విక్రయించాడు. ఇదంతా నిజమని నమ్మిన దిలీప్ మిగిలిన మొత్తం రూ. 90 లక్షలను వారికి చెల్లించాడు. అయితే, విజయ్‌కుమార్ తన వద్ద ప్రస్తుతం స్టాక్ లేదని, వారి మేనేజ ర్ నంబూరి డేవిడ్ లివింగ్‌స్టోన్‌ని కలవడానికి చెన్నైలోని రాయల్ మెరిడియన్ హోట ల్‌కి తీసుకెళ్లారు.

అయితే బంగారాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 35లో తాను చెప్పిన చిరునామాలో తీసుకోవాలని డేవిడ్ వారికి సూచించాడు. దీంతో హైదరాబాద్‌కు చేరుకున్న దిలీప్ చిరునా మా కోసం విజయ్‌కుమార్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీలోని నెల్లూ రు జిల్లా కవాలి మండలం కంచరమెట్టకి చెందిన కర్రెందుల విజయ్‌కుమార్ అలియా స్ కృష్ణ మోహన్ చౌదరి (39), అలాగే మాద్దార్పాడుకు చెందిన బోగిరి సునీల్ కుమార్ అలియాస్ హరీశ్(27),  గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాంబూరి డేవిడ్ లివింగ్‌స్టోన్ అలియాస్ సెంథిల్ (52), నెల్లూరు జిల్లా శివాజీనగర్‌కు చెందిన అడిగోప్పుల ఓం సాయి కిరిటీ (26)లను కీసర ఓఆర్‌ఆర్ దగ్గర అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.51 లక్షల నగదు, 5 కిలోల నకిలీ బంగారం, 3 కార్లు, ఒక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాం, రూ. 6.86 కోట్ల నకిలీ నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై గతంలోనూ పలు కేసు లు ఉన్నట్లు సీపీ వెల్లడించారు.