న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం తులం ధర సోమవారం రూ.1000 క్షీణించి రూ.79,400లకు పడిపోయింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1000 తగ్గి రూ.79,400లకు చేరుకుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1600 పతనమై రూ.91,700 వద్ద స్థిర పడింది. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.80,400 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.93,300 పలికింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ బంగారం తులం ధర రూ.1071 తగ్గి రూ.76,545లకు చేరుకున్నది. కిలో వెండి ధర డిసెంబర్ డెలివరీ ధర రూ.1,468 పతనమై రూ.89,300 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్ ఫ్యూచర్స్లో ఔన్స్ బంగారం ధర 40.80 డాలర్లు పతనమై 2696.40 డాలర్లకు చేరుకున్నది. ఔన్స్ వెండి ధర 1.7 శాతం తగ్గి 31.24 డాలర్లు పలికింది.హైదరాబాద్ సహా దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లో కూడా ఇదే విధమైన ధోరణి కనిపించింది.