22-04-2025 01:43:42 AM
కిలో వెండికి 99,299
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: బంగారం ధర సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో కొండెక్కి కూర్చున్న పుత్తడి సోమవారం మ రింత ప్రియంగా మారింది. ఒకానొక దశలో సోమవారం 24 క్యారె ట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,00,016 (3 శాతం జీఎస్టీతో కలి పి) పలికింది. ఆపై కాస్త దిగొచ్చి రూ. 99,900 వద్ద స్థిరపడింది. శుక్రవా రం ముగింపుతో పోలిస్తే సోమవా రం బంగారం ధర రూ. 2వేలు పెరిగింది.
డాలర్ బలహీనపడటం, అ మెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధర రాకెట్ స్పీడ్‌లో పెరిగేందుకు కారణం అవుతున్నా యి. ఈ ఏడాదిలో 10 గ్రాముల బంగారానికి 26 శాతం మేర దాదా పు రూ. 20,800 ధర పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి ధర 3,405 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ఓసారి లక్ష మార్కు ను క్రాస్ చేసిన కిలో వెండి ధర రూ. ఇప్పుడు 99,299 పలుకుతోంది.