కార్వాన్, జనవరి4: ప్రఖ్యాత గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం అధికారులు లెక్కించారు. మొత్తం లక్షా 25వేల 394 రూపాలయ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వసంత తెలిపారు. ఇది గత మూడు నెలలకు సంబంధించిన ఆదాయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అర సలహాదారు సాయిబాబా చారి, అర్చకులు సర్వేశ్, సురేష్‌చారి, వృత్తిపనివారల సంఘం అధ్యక్షుడు శివశంకర్, ప్రతినిధులుపాల్గొన్నారు.