విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): గోల్కొండ ప్రభుత్వ దవాఖాన ను 200 పడకలతో అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని గోల్కొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. పిల్లల ఓపి, డయాలసిస్ సెంటర్, ఫార్మసీ, ఔట్ పేషెంట్ వార్డు, డెంటల్ ట్రీట్‌మెంట్ వార్డు, ఐసీయూలను పరిశీలించారు. అనంతరం గోల్కొండలోని ప్రభుత్వ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్య లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సునీత, గోల్కొండ ఆసుపత్రి సూపరిండెంట్ మహమ్మద్ మజారుద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి) : విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. శుక్రవారం గోల్కొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సెకండ్ లాన్సర్ పాఠశాలను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వనందుకు డిప్యూటీ డీఈవో రమణరాజు, డిప్యూటీ ఐఓఎస్ మాఖ్బూల్, ప్రధానోపాధ్యాయులు వాజిద్‌హస్మీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.