calender_icon.png 23 December, 2024 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డేట్‌కు వెళ్తున్నారా!

19-10-2024 12:00:00 AM

ప్రస్తుతం డేటింగ్ అనేది కామన్‌గా మారింది. చాలామంది అమ్మాయిలు బ్లైండ్‌గా డేట్‌కు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు తెలియకుండానే డేట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ అనుభవం కొత్తదే అయినప్పటికీ అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకే ఎక్కువ ప్రమాదం. డేట్‌కు వెళ్లే అమ్మాయిలు శారీరకకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు పలు సర్వేలోనూ తేలింది.

డేట్‌కు వెళ్లే అమ్మాయిలు చాలామంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అమ్మాయిలు తమ డేట్ పార్ట్‌నర్ నమ్మదగినవారు కాకపోవడంతో వేధింపులబారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవతలవారు వ్యక్తిగత ఫోటోలు తీసి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాగే బ్లుండ్ డేటింగ్‌లో సైబర్ నేరాల ప్రమాదం కూడా ఉంది.

ఫేక్ ప్రొఫై ల్స్ ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని పొంది దుర్వినియోగం చేస్తున్నారు. కొన్నిసార్లు అమ్మాయిల ఫోటోలు లేదా వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో దుర్వినియోగమవుతున్నాయి. అయితే బ్లైండ్ డేట్‌కు వెళ్లాలా వద్దా? అనేది మీ వ్యక్తిగత నిర్ణయం కావచ్చు.

అయితే అమ్మాయిలు తమ భద్రతను అన్ని విధాలా చూసుకోవాలి. డేటింగ్ వెళ్లేముందు పార్ట్‌నర్ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. మొదటిసారి పబ్లిక్ ప్రదేశాల్లో కలుసుకోవాలి. దాంతో భద్రతకు ముప్పు ఉండదు.