calender_icon.png 22 April, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడిపండ్ల కోసం వెళ్లి మృత్యు ఒడికి

18-04-2025 12:00:00 AM

కరెంట్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి 

రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: మామిడి పండ్ల కోసం వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. ఇబ్రహీంపట్నంకు చెందిన కర్రి చేతన్ రెడ్డి (26), రౌతు బిందు దంపతులు.

గురువారం మొయినాబాద్ మండల పరిధిలోని భాస్కర్ లా కాలేజీలో బిందుకి  పరీక్ష ఉండటంతో తన భర్త చేతన్ రెడ్డితో కలిసి వెళ్ళింది. పరీక్ష ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి బైక్‌పై ఇబ్రహీంపట్నం బయలుదేరారు. మార్గమద్యలో పెద్దషాపూర్ గ్రామ పరిధిలో గోనెల యాదయ్యకు చెందిన మామిడి తోట వద్ద ఆగారు.

తోటలోకి వెళ్లిన చేతన్ రెడ్డి మామిడిపండ్లు తీసుకొని వస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ఫా ర్మర్‌కు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృతి చెందాడు. బిందు రెడ్డి సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.