- బ్యాంకాక్ వెళ్లిన టీచర్లు
- విచారించకుండా సెలవు ఇచ్చిన అధికారులు
సూర్యాపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు విదేశీ పర్య టనకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. ప్ర భుత్వ ఉపాధ్యాయులైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ వద్ద, ఇతర శాఖల ఉద్యోగులైతే కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవాలి.
కానీ సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనుమతులు లేకుండానే ఈ నెల 18న బ్యాంకాక్‌కు వెళి, 22న తిరిగి వచ్చారు. పర్యటకు వెళ్లేముందు జిల్లా అధికారులకు డీఎ స్‌ఈ అనుమతి పత్రాలను అందిచాలి. కానీ అలా జరుగలేదు. కేవలం సెలవు పెట్టి విదేశాలకు వెళ్లారు. కానీ వారు పర్యటనలో ఉం డగా ఈ నెల 21న అనుమతి పత్రాలు ప్రత్య క్షం కావడం గమనార్హం.
విదేశాలకు వెళ్లిన వారిలో ఆత్మకూర్ (ఎస్) మండలం పొట్టిసూర్యతండా ప్రాథమిక పాఠశాల ఉపా ధ్యాయుడు తంగెళ్ల వాసుదేవరెడ్డి, ఏపూరు ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ ఎర్రబో తు సుధాకర్‌రెడ్డి, సూర్యాపేట మం డలం ఎర్కారం గ్రామ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ చింతారెడ్డి వీరారెడ్డి ఉన్నారు.
వీరు వీదేశి పర్యటనకు వెళ్లేందుకుగాను అనుమతి కోరుతూ ఈ నెల మొదటి వారంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు మండల అధికారుల ద్వారా అర్జీ పెట్టుకున్నారు. ఈ నెల 4న జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి డీఎస్‌ఈకు అర్జీ చేరింది. కానీ ఈ నెల 18 వరకు ఎలాంటి అనుమతులు రాలేదు.
ఏపూరు మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఈ నెల 18 నుంచి 22 వరకు బ్యాంకాక్ వెళ్తున్నందున సెలవు కావాలని ఎంఈవోకు, సూర్యా పేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు పాఠశాల హెచ్‌ఎంకు లేఖ రాశారు. డీఎస్‌ఈ అనుమపతి పత్రాలు సమర్పించకున్నా సెలవులు మంజూరు చేశారు.
ముగ్గురు ఉపా ధ్యాయులు అనుమతి లేకుండా దేశం దాటారని తెలిసిన కొందరు ఉపాధ్యాయులు మం డల, జిల్లా అధికారుల వద్ద వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు చేరింది.
అనుమతి లేకుండా వెళ్లారన్న విషయం బయటకు వస్తే తమ ఉద్యోగాలకు ప్రమాదమని గ్రహించి ఓ సంఘం నేతల ఒత్తిడితో ఈ నెల 21 న డీఎస్‌ఈ నుంచి ఆర్డర్ తెప్పి చ్చి, మండల విద్యాశాఖ అధికారుల వాట్సప్‌కు చేర్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఆ ఆర్డర్ కాపీలో ఈ నెల 19 తేదీ నుంచే అనుమతులు వచ్చినట్లుగా ఉండటం గమనార్హం. ఉపాధ్యాయుల పర్యటన అనుమతుల వెనుక మండల, జిల్లా అధికారుల హస్తం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి.
అనుమతి తప్పనిసరి
ఉపాధ్యాయులు దేశం దాటి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఎవరైనా అనుమతులు లేకుం డా విదేశాలకు వెళ్లినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. జిల్లా లో ముగ్గురు ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లినట్లు నాకు తెలియదు. వివ రాలు సెక్షన్‌లో ఉంటాయి.
అశోక్, డీఈవో, సూర్యాపేట
అనుమతి పత్రాలు ఇవ్వలేదు
ఆత్మకూర్(ఎస్) మండలంలోని పొట్టిసూర్యతండా, ఏపూరు పాఠశాలలో ఎస్‌జీటీలు వాసుదేవరెడ్డి, సుధాకర్‌రెడ్డి బ్యాంకాక్ వెళ్లేందుకు సెలవు కావాలని ఈ నెల 17న అర్జీ పెట్టుకున్నారు. ఆ సమయంలో డీఎస్‌ఈ నుంచి వచ్చిన అనుమతి పత్రాలను నాకు అందించలేదు. కానీ ఈ నెల 21న డీఎస్‌ఈ నుంచి వచ్చిన అనుమతి పత్రాలను వాట్సప్ ద్వారా పోస్ట్ చేశారు. నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లే ముందే అనుమతి పత్రాలను సమర్పించాలి.
దారాసింగ్, ఎంఈవో, ఆత్మకూర్(ఎస్)