calender_icon.png 10 January, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాఫ్ వర్సెస్ స్వియాటెక్

05-01-2025 12:55:00 AM

యునైటెడ్ టెన్నిస్ కప్ 

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు సన్నాహకంగా భావిస్తోన్న యునైటెన్ టెన్నిస్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో అమెరికా, పోలండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో గాఫ్, స్వియాటెక్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అమెరికా తరఫున కోకో గాఫ్, టేలర్ ఫ్రిట్జ్.. పోలండ్ తరఫున స్వియాటెక్, హుర్కాజ్ తలపడనున్నారు.

శనివారం జరిగిన తొలి సెమీస్‌లో అమెరికా 3 చెక్ రిపబ్లిక్‌పై, పోలండ్ 3 కజకిస్థాన్‌పై విజయాలు సాధించాయి. మహిళల సింగిల్స్ సెమీస్‌లో గాఫ్ 6 6 కరోలినా ముచోవాపై, స్వియాటెక్ 7 (7/5), 6 రిబాకినాపై విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్ సెమీస్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6 (7/4), 6 థామస్ మెక్‌హక్‌పై, హుర్కాజ్ 6 6 షెచెంకోపై విజయాలు అందుకున్నారు. ఇక బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో నంబర్‌వన్ సబలెంకా ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీస్‌లో సబలెంకా మిర్రా ఆండ్రీవాపై, మరో సెమీస్‌లో కుడ్‌మెటోవా విజయం సాధించాయి. పురుషుల ఫైనల్లో లెహెక్కా, ఒపెల్కా అమీతుమీకి సిద్ధమయ్యారు.