calender_icon.png 8 January, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాఫ్ విజయదుందుభి

07-01-2025 01:23:15 AM

  • ఫైనల్లో స్వియాటెక్‌పై విజయం 

అమెరికాదే యునైటెడ్ టెన్నిస్ కప్

సిడ్నీ: యునైటెడ్ కప్ టెన్నిస్ టో ర్నీ విజేతగా అమెరికా జట్టు నిలిచిం ది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో అమెరికా 2 తో పోలండ్‌పై విజయాన్ని అందుకుం ది. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ రెండో ర్యాంకర్ స్వి యాటెక్‌కు షాకివ్వగా.. పురుషుల సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ హుర్కాజ్‌పై విజయం సాధించాడు. గత మూడేళ్లలో అమెరికా యునైటెడ్ కప్‌ను గెలవడం ఇది రెండోసారి కావడం విశేషం.

తొలుత మహిళల సింగిల్స్‌లో గాఫ్ 6 6 స్వియాటెక్‌ను ఓడించింది. 20 ఏళ్ల గాఫ్ యునైటెడ్ కప్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ అందుకుంది. ఇక స్వియాటెక్‌పై గాఫ్‌కు ఇది వరుసగా రెండో విజయం.

గతేడాది నవంబర్‌లో రియాద్ వేదికగా జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ స్వియాటెక్‌పై గాఫ్ విజయదుందుభి మోగించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6 5 7 (7/4)తో హుర్కాజ్‌ను మట్టికరిపించాడు. పోలండ్ రెండోసారి రన్నరప్‌కే పరిమితమైంది. గతేడాది జర్మనీ చేతిలో ఫైనల్లో పరాజయం చవిచూసింది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ జనవరి 12 నుంచి మొదలుకానుంది.