- మూడో రౌండ్‌కు అమెరికా స్టార్
- అల్కరాజ్, సబలెంక, జొకోవిచ్ ముందంజ
- కాస్పర్ రూడ్, జెంగ్‌కు షాక్
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగిన కాస్పర్ రూడ్ పరాజయం పాలవ్వగా.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్‌ను అతికష్టం మీద నెగ్గాడు. అల్కరాజ్ సునాయాస విజయాన్ని అందుకోగా.. మహిళల సింగిల్స్‌లో గాఫ్, సబలెంకా, ఒసాకా, బడోసా ముందంజ వేశారు.
బుధవారం జరిగిన మహిళల సింగి ల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో గాఫ్ (అమెరికా) 6-3, 7-5తో జోడీ బుర్రాగే (బ్రిటన్)పై అలవోక విజయాన్ని అందుకుంది. గంటా 29 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్ 3 ఏస్‌లతో పాటు 14 విన్నర్లు సంధించింది. బుర్రాగే మ్యాచ్‌లో 21 విన్నర్లు కొట్టినప్పటికీ ఆరు డబుల్ ఫాల్ట్స్, 45 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
ప్రపంచ నంబర్ వన్ అరీనా సబలెంక (బెలారస్) 6-3, 7-5తో బౌజస్ మనెరియోపై సునా యాస విజయాన్ని సాధించి మూడో రౌండ్‌కు చేరుకుం ది. జపాన్‌కు చెంది న ఒసాకా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాపై, మరో మ్యాచ్‌లో బడోసా విజయాలు సాధించారు. మిగిలిన మ్యాచ్‌ల్లో పెగులా, ఆండ్రీవా, వెకిక్ ముందంజ వేశారు.
అతికష్టం మీద..
పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ నొవాక్ జొకోవిక్ అతికష్టం మీద రెండో రౌండ్ నెగ్గాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 6-1, 7-6 (7/4), 6-3, 6-2తో జేమీ ఫారియా (పోర్చుగల్)పై విజయం సాధించాడు. స్పెయిన్ యువ కెరటం అల్కరాజ్ 6-0, 6-1, 6-4తో నిషియోకా (జపాన్)పై , రెండో సీడ్ జ్వెరెవ్ 6-1, 6-4, 6-1తో మార్టినేజ్‌పై అలవోక విజయాలు సాధించారు. అయితే ఆరో సీడ్ కాస్పర్ రూడ్‌కు 2-6, 6-3, 1-6, 4-6తో అన్‌సీడెడ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) ఊహించని షాక్ ఇచ్చాడు.