రియాద్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో గాఫ్ 7 (7/4), 6 ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. ఫైనల్లో గాఫ్ ఒలింపిక్ చాంపియన్ జెంగ్ కిన్వెన్తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా గాఫ్ (20 ఏళ్లు) నిలిచింది. మ్యాచ్‌లో గాఫ్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించగా.. సబలెంకా నాలుగింటికే పరిమితమైంది. మరో సెమీస్‌లో జెంగ్ 6 7 బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం నమోదు చేసుకుంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నుంచి 36 మ్యాచ్‌లు ఆడిన జెంగ్‌కు ఇది 31వ విజయం.