- తీవ్రవాదుల్లా బీజేపీ నేతల తీరు
- దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగం
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ 18: ప్రధాని మోదీ, బీజేపీ గాడ్సే వారసుల్లా పాలన సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శిం చారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసి న వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా బుధ వారం హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంతోపాటు హుజుబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వివి ధ రాష్ట్రాల్లో ఓడిపోతామనే భయంతో రాహుల్‌గాంధీని బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ ప్రధాని అయ్యారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ హోం మంత్రి అమిత్‌షా కనుసన్నల్లో తీవ్రవాదులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నేతలని కొనియాడారు.
వారి కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని చంపుతామనడం సిగ్గుమాలిన చర్య అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్ గుండు సుధాకర్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయ ణరావు, ఎమ్మెల్సీ సారయ్య పాల్గొన్నారు. జమ్మికుంటలో ఇటీవల మృతిచెందిన తుమ్మే టి సమ్మిరెడ్డి కుటుంబాన్ని మహేశ్‌గౌడ్ పరామర్శిచారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
రాహుల్‌గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, తన్విందర్‌సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు నేతృత్వంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి పాల్గొన్నారు. నారాయణగుడ చౌర స్తాలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యం లో, వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురంలో ఎ మ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్, ఖమ్మం, కరీంనగర్‌లో దిష్టిబొమ్మలను దహనం చేశారు.