calender_icon.png 2 April, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి పాలనను దేవుళ్లు ఆశిర్వదిస్తున్నారు

31-03-2025 01:26:00 AM

 సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ 

సిద్దిపేట, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పాలనను దేవుళ్ళు సైతం ఆశీర్వదిస్తున్నారని సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం కార్యాలయంలో తెలుగు నూతన విశ్వావసు సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించి, పంచాంగం భవిష్యవాణి వివరించారు.

ఈ సంవత్సరం పంటలు సమృద్ధి గా పండి, రైతు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉగాది పండుగ ఉత్సవాలు నిర్వహించారు. అర్చకులు పూజా కార్యక్రమాల, అనంతరం ఉగాది పంచాంగాన్ని అందరికీ చదివి వినిపించగా, ఈ సంవత్సరం అంతా ప్రజలకు మంచే జరగనుందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయిని తెలిపారు.

ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని కోరారు. తమ ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఏప్రిల్ ఒకటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంప మహేందర్ రావు, జీవన్ రెడ్డి, కాలీముద్దీన్, బొమ్మల యాదగిరి, దాస అంజన్న, డీసీసీ మహిళా అధ్యక్షులు ముద్ధం లక్ష్మి, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ, అర్బన్ మండల అధ్యక్షులు బిక్షపతి, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, చెంది శ్రీనివాస్ ముదిరాజ్, భైరి సాయి, ఆలయ చైర్మన్ కరుణాకర్ భాగన్న, జనార్దన్ రెడ్డి, చిరంజీవి, కుమార స్వామి, మనోహర్ రెడ్డి, ఉప్పెరెట్ల సంతోష, బండి శివ, రమేష్, శ్రీకాంత్, పవన్, ప్రతాప్, వంశీ, నవీన్ ముదిరాజ్, లత రెడ్డి, రజని, తదితరులు పాల్గొన్నారు.