calender_icon.png 24 March, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థికి ప్రతిష్టాత్మక గోద్రెజ్ అగ్రోసెట్ స్కాలర్షిప్

22-03-2025 12:14:20 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని అస్మా సుల్తానా ప్రతిష్టాత్మక గోద్రెజ్ అగ్రోసెట్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ స్టూడెంట్ స్కాలర్షిప్ కు ఎంపికైంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. పుష్పవతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురు విద్యార్థులను మాత్రమే ఈ స్కాలర్షిప్‌కి ఎంపిక చేస్తారని, అందులో విద్యార్థిని అస్మా సుల్తానా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన కార్యక్రమంలో అస్మా సుల్తానాకు స్కాలర్షిప్‌ను అధికారికంగా ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క విద్యార్థి మాత్రమే ఎంపిక కావడంతో, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.