మహావీర్ ఆలయంలో గో ధ్వజాన్ని స్థాపించిన జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి
పాట్నా (బీహార్), సెప్టెంబర్ 24: జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ తలపెట్టిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర మంగళవారంతో మూడో రోజుకు చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ మహావీర్ ఆలయంలో గోధ్వజాన్ని శంకరాచార్య స్వామీజీ స్థాపించారు.
ఈ కార్యక్రమంలో గోపాలమణి మహారాజ్, ఆచార్య కిశోర్ కునాల్, దేవేంద్రపాండే, ఆనంద్ ఉపాధ్యాయ్, శైలేంద్రయోగి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మలీన్ గురుదేవ్ శిష్యులు సంతోష్ పాఠక్ అభ్యర్థన మేరకు ఆయన నివాసాన్ని శంకరాచార్య స్వామీజీ సందర్శించారు.
అక్కడి గోశాలలో గోపూజ నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర నాలుగో రోజు సందర్భంగా సిక్కింలో నిర్వహించనున్నట్లు స్వామీజీ వెల్లడించారు. ఈ యాత్రలో మొత్తం 36 నగరాల్లో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ పర్యటించనున్నారు.