calender_icon.png 26 October, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ఘట్టానికి గోధ్వజ్ యాత్ర

26-10-2024 12:46:46 AM

  1. నేడు ఢిల్లీలో శంకరాచార్య పర్యటనతో ముగింపు
  2. 35 రోజులుగా కొనసాగుతోన్న గో ఆందోళన్ యాత్ర
  3. డెహ్రాడూన్‌లో గోప్రతిష్ఠ ధ్వజాన్ని ఆవిష్కరించిన స్వామీజీ

డెహ్రాడూన్, అక్టోబర్ 25: జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి చేపట్టిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. శనివారం ఢిల్లీలో గోప్రతిష్ఠ ధ్వజం స్థాపనతో యాత్ర ముగుస్తుంది. సిమ్లాలో గురువారం పర్యటించిన స్వామీజీ శుక్రవారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడ గోధ్వజాన్ని స్వామీజీ స్థాపించారు.

అనంతరం నగరంలోని మీనాక్షి ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఆవు ప్రాము ఖ్యాన్ని భక్తులకు వివరించారు. కాగా, డెహ్రాడూన్‌కు చేరుకున్న స్వామీజీకి అక్కడి భక్థులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు.

శుక్ర వారం ఉదయం డెహ్రాడూన్‌లో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో మొత్తం 36 రాజధాని నగరాల్లో శంకరాచార్య స్వామీజీ పర్యటిస్తున్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ యాత్రను చేపట్టారు.అయోధ్య నుంచి సెప్టెంబర్ 22న ప్రారంభమైన యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజు గోవును రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని స్వామీజీ ఇప్పటికే ప్రకటించారు.