మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) : సకల విద్యా స్వరూపిణి సరస్వతి దేవి సన్నిధిలో తమ చిన్నారుల విద్యాభ్యా సం వసంత పంచమి రోజు చేసేం దుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించారు. సోమవారం వసంతం పంచమి రోజును పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా పలు ఆలయాల్లో చిన్నారు లకు విద్యాభ్యాసం చే యించారు.
ఈ సందర్భంగా ఆలయంలో కొలువు తీరిన భగవంతుడి స్వరూపాలను ప్రత్యేకంగా దర్శించు కుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. పలు ఆలయాల కమిటీ సభ్యులు భక్తుల రాకను గమనించి ముందస్తుగా ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.