12-02-2025 06:50:22 PM
విగ్రహ దాత సకిన సుజాతకు పలువురు ప్రశంసలు..
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని దేవరపల్లి పాఠశాలలో సకిన సుజాత తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని కొని ఉపాధ్యాయులందరూ కలిసి బుధవారం విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి. అనులక్ష్మి మాట్లాడుతూ సుజాత చరిత్ర గర్వించదగ్గ కార్యక్రమాన్ని నిర్వహించారని తాను పనిచేస్తున్న దేవరపల్లి పాఠశాలలో రూ.25 వేలు విలువైన విగ్రహాన్ని కొనుగోలు చేసి ఉపాధ్యాయుల అందరి సహాయ సహకారాలు తీసుకొని ప్రతిష్టింపచేయడం చాలా అభినందించవలసిన విషయమని ఆమె కొనియాడారు.
ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహాలను ప్రతిష్టించి విద్యార్థులను చదువు పట్ల ఆకర్షించే విధంగా చూడాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా సకిన సుజాత మాట్లాడుతూ... తాను చదువుకునే రోజుల నుండి సరస్వతి దేవి అంటే భక్తి శ్రద్ధలు ఉండేవని అందువల్లనే సరస్వతి కటాక్షం కలిగి నేను ఉపాధ్యాయురాలుగా సమాజంలో మెలగలుగుతున్నానని ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవాచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ తెల్లం జగపతి ఉపాధ్యాయులు రామా జ్యోతి, బి తిరుమల, ఎస్ దుర్గాభవాని గ్రామ పెద్దలు తెల్లం రామారావు, విద్యార్థులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.