calender_icon.png 10 October, 2024 | 6:55 PM

జగన్నాధపురంలో ఘనంగా దేవి నవరాత్రులు

10-10-2024 04:05:07 PM

శ్రీ వన దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు..

మునగాల (విజయక్రాంతి):- మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. 8వ రోజు అమ్మవారు భక్తులకు శ్రీ వన దుర్గాదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి, దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.