calender_icon.png 6 October, 2024 | 6:09 PM

లలితా దేవి అలంకారంలో పూజలు అందుకున్న అమ్మవారు

06-10-2024 03:29:52 PM

యాదాద్రి భువనగిరి ( విజయక్రాంతి ) : ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి నృసింహుడి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం మరియు ప్రాతఃకాల పూజ అర్చనలు పారాయణములు గాయత్రీ జపములు లలిత సహస్రనామార్చన మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరిగినది. సాయంకాలం శ్రీదేవి  చతుషష్టి ఉపచార పూజ  సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు తీర్థ ప్రసాద వితరణ జరిపారు.