calender_icon.png 22 March, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం

22-03-2025 12:05:23 AM

పరిగి,(విజయక్రాంతి): గ్రామ దేవతల విగ్రహాల ధ్వంసం పక్షం రోజుల్లో రెండు ఆలయాల్లో భిన్నమైన అమ్మవారి విగ్రహాలు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా గ్రామంలో దేవతామూర్తుల అమ్మవారి విగ్రహాలు ఎప్పుడు కూడా భిన్నమైన సందర్భాలు లేవని ఇదేమి విచిత్రం 15 రోజుల ముందుగాల గ్రామ నడిబొడ్డులో పోచమ్మ తల్లి గుడిలో ఉన్న విగ్రహాన్ని భిన్నం చేయడం. ఇప్పుడేమో గ్రామానికి ఈశాన్య బాగానే ఉన్నా అమ్మవారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని భిన్నం చేయడం దారుణంగా ఉన్నది ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా బసిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకోలేదని ఇలా అమ్మవారి విగ్రహాలు భిన్నం కావడం వలన ప్రజలు గ్రామానికి ఏమైనా అరిష్టం ఏమైనా జరుగుతుందా అంటూ భయాందోళనకు గురవుతున్నారు.

 బసిరెడ్డి పల్లి గ్రామంలో గ్రామ పోచమ్మ , మాల పోచమ్మ ఆలయాల్లో విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ( భిన్నం) ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పక్షం రోజుల క్రితం మొదటి విగ్రహం ద్వంసం మైనప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే రెండో విగ్రహం ద్వంసం కాకుండా ఉండేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో ఎన్నడు ఇలాంటి ఘటనలు జరగలేదని ఇలాంటి ఘటనలపై తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాదని ఎక్కడినుంచి వచ్చి విగ్రహాలతో ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఇలాంటి ఘటన పునవృతం కాకుండా విగ్రహాల ధ్వంసానికి  పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకొని శిక్షించాలని  కోరుతున్నారు.