calender_icon.png 19 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం

18-04-2025 10:24:37 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని బ్రహ్మంగారి తండాలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ గుడిలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకు అభిషేకం, గణపతి పూజ, పుణ్యా హావచనము, కంకణ ధారణ, అఖండ కలశ స్థాపన, మంటపారాధన, వాస్తు పూజ, జలాధివాసము, జ్యోతి ప్రజ్వలన, హోమము నిర్వహించారు. దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా బ్రహ్మంగారి తండాలో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.