పాపన్నపేట ఫిబ్రవరి 2: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మా తను సోమవారం వసంత పంచమిని పురస్కరించు కొని చదువుల వరదాయిని సరస్వతీదేవి రూపంలో అలంకరించారు. ఆలయ అర్చకులు పార్థివ శర్మ వేకువజామునే అమ్మవారికి పంచామృత అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలు, హంస, వీణ, పుస్తకాలు, పలకలు, పెన్నులతో సరస్వ తి దేవి రూపంలో అత్యంత సుందరంగా అలంకరిం చారు. అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమా ర్చన అనంతరం భక్తులకు వనదుర్గాదేవి దర్శనం కల్పించారు.