మంథని గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్
పెద్దపల్లి,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా పర్యావరణాన్ని కాపాడుతూ గణేష్ నవరాత్రుల పండుగను జరుపుకోవాలని గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ప్రజలను కోరారు. శుక్రవారం మంథని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గణపతి పండుగ ప్రారంభోత్సవాల భాగంగా మత పెద్దలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో హనుమాన్ నాయక్ తో పాటు మంథని సిఐ రాజు ఎస్సై రమేష్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎసిపి ఆర్డిఓ మాట్లాడుతూ గణపతి నవరాత్రుల ఉత్సవాలను ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మతాలకు అతీతంగా పాల్గొని ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. డిజే లకు అనుమతి లేదని ఎవరైనా డీజే వాడినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని మతాల నాయకులు, గణేష్ మండపాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.