భద్రాద్రి కొత్తగూడెం: 2026 వరకు సీతారామ ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆయకట్టుకున్ని సాగును అందిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎంత ఖర్చైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలను అందిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని మొలకలపల్లి మండలం పూసుగూడెం సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంపు హౌజులో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ట్రయల్ రన్ చేశారు.