05-03-2025 12:55:06 AM
వైరా ప్రాజెక్టులోకి గోదావరి జలాలు
ఖమ్మం, మార్చి 4(విజయక్రాంతి ): సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తిచేసి కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో దుర్గా ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు లు మాట్లాడారు . సీతారామ ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు విడుదల చేయడం జరిగిందని, దీంతో సాగర్ ఆయకట్ట పరిధిలోని రైతులు కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని అన్నారు.
గోదావరి నది కృష్ణా నదులను కలపడం కోసం ఎంతో మంది రైతులు తమ విలువైన భూములను వదులుకొని ప్రభుత్వానికి సహకరించినం దుకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం చాకచక్యంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అతి తొందరగా రైతాంగానికి సాగునీరు అందించడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా శాసనసభ సభ్యులు మాలోత్ రాందాసు నాయక్‌లకు ఖమ్మం జిల్లా రైతాంగం తరపున,జిల్లా కాంగ్రెస్ తరపున ధన్య వాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
టిపిసిసి సభ్యులు , జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కిసాన్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డుvబొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ రషీద్,రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు జెరిపోతుల అంజనీ కుమార్, జిల్లా ఓభీసీ సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ, బోయిన వేణు,పాలేరు నియోజకవర్గ సేవాదళ్ అద్యక్షులు బచ్చలికూరి నాగరాజు,గుడిపూడి వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.