గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
44.1 అడుగుల చేరుకున్న గోదావరి నీటిమట్టం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి చేరడంతో బుధవారం మధ్యాహ్నం 4 గంట సమయానికి గోదావరి నీటిమట్టం 44.1 అడుగులకు చేరుకుంది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదారి ఉదృతి అంచనాలను గమనిస్తూ ముంపు ప్రాంత వాసులను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.