నీటిమయంలో రాములవారి కళ్యాణకట్ట
భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద వృద్ధతి కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజామున వరకు గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరింది. చత్తీస్గడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు తాళి పేరుప్రాజెక్టుకు వరద నీరు చేరుకోవడంతో, గేట్లు ఎత్తి నీటిని దిగువ భాగానికి వదులుతున్నారు. దీంతో గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 50.30 అడుగులకు చేరింది.
దీంతో రాముల వారి కళ్యాణ కట్టకు పూర్తిగా జలమయమైంది. గోదావరి నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల నీటిని పోలవరంకు వదులుతున్నారు. ఇప్పటికే తెలంగాణ చతిస్గడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం టు భూపాల్ పల్లి రోడ్డు పై రాకపోకలు స్తంభించాయి. మరో మారు గోదావరి తన ఉగ్రరూపాన్ని చూపుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలను తరలిస్తున్నారు.