calender_icon.png 28 November, 2024 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగూర్, మంజీరాకు గోదావరి నీళ్లు

28-11-2024 02:46:45 AM

  1. ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుతో పాటు గ్రేటర్‌కు తాగునీటి సరఫరా
  2. అదే తరహాలో నిజాం సాగర్‌కూ గోదావరి నీళ్లు
  3. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పూర్తికి మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

హైదరాబాద్/ కరీంనగర్ నవంబర్ 27 (విజయక్రాంతి): సింగూర్, మంజీరా రిజర్వాయర్లకు గోదావరి జలాలు తరలిస్తామని, తద్వారా ఆయా రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టు పెరగడమే కాకుండా, హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

నిజాంసాగర్‌కు కూడా గోదావరి జలాలతో నింపుతా మని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం  ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, కమిషనర్ వినయ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్ట్‌లో పూడికతీత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సింగూర్ కాల్వల లైనింగ్‌కు టెండర్లను ఆహ్వానించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. టెండర్లు పూర్తు పనులు షురూ కాని బసనేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలుపెట్టాలన్నారు.

పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతలకు రూ.660 కోట్లు ఖర్చవతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్ధాంతరంగా ఆగిన ప్యాకేజ్ పనులను తక్షణమే పునరుద్ధరించాలని చెప్పారు.

ప్యాకేజ్ 17, 18, 19ల పనుల్లోనూ వేగం పెంచాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్ మరమ్మతులతో పాటు జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు మంత్రి ఆమోదం తెలిపారు. అంతేకాకుండా నారాయణఖేడ్  నియోజకవర్గ పరిధిలో కారముంగి ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల విషయమై సంబంధిత అధికారులతో భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణారావు తదితరులు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం, పత్తిపాక రిజర్వాయర్ల నిర్మాణ విషయమై సమావేశంలో చర్చించారు. కాళేశ్వరం కాళేశ్వరం ప్రా జెక్ట్ పరిధిలోని ప్యాకేజీ 9, 10, 11, 12 పనుల పూర్తికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు.