calender_icon.png 18 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా అభిషేకానికి గోదావరి జలం

18-01-2025 01:23:36 AM

*సేకరించిన మెస్రం వంశీయులు

ఆదిలాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర నేపథ్యంలో పవిత్ర గోదావరి నీళ్ల కోసం ఈ నెల 10న పాదయాత్రగా బయలుదేరిన మెస్రం వంశీయులు సుమారు 150 కిలోమీటర్ల మేర నడిచి శుక్రవారం జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గల గోదావరి నది వద్దకు చేరుకున్నారు.

నదిలో పుణ్యస్నాలను ఆచరించి, నాగదేవతకు అభిషేకం చేసేందుకు పవిత్ర జలాలను సేకరించారు. తిరుగు ప్రయాణంలోనూ పాదయాత్రగా వచ్చి గోదావరి జలాలతో ఈ నెల 28న అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మహాపూజతో జాతరను ప్రారంభిస్తారు.