నిర్మల్, (విజయక్రాంతి): జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నిన్న రాత్రి నుండి గోదావరికి వరద పెరగడంతో అధికారులు అప్రమత్తమై పుష్కర్ ఘట్లకు ఎవరు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బోట్లలోనికి ప్రవేశించకుండా సిబ్బందికి సూచనలు చేశారు. గోదావరి నది పుష్కర ఘాట్లను ఆనుకొని నిండుగా ప్రవహించడంతో జలకళ సంతరించుకుంది.