భద్రాచలం: కార్తీక బహుళ ద్వాదశి సందర్బంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు పవిత్ర గోదావరి నది తీరంలో గోదావరి నది హారతులు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రధాన దేవాల నుండి బయలుదేరి నది తీరానికి ఊరేగింపుగా చేరుకున్న వేద పండితులు అర్చకులు సరిగ్గా 6 గంటలకు గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ప్రారంభించగా వందలాది మంది భక్తులు ఆ కార్యక్రమాలను తిలకించి పరవశించిపోయారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు అరటి దబ్బలు ఒత్తులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు.