నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోను మండలంలోని కడ్తాల్ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం అరకు ఉత్సవాన్ని గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలను శోభయాత్రగా తీసుకెళ్లి సోను గోదావరి నదిలో పుణ్య స్థానం పంచామృత స్థానం నిర్వహించి పల్లకి సేవ ద్వారా ఆయనకి తీసుకువచ్చారు. అయ్యప్పలలో పూజలు అభిషేకం భక్తి పాటలతో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.