calender_icon.png 30 October, 2024 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేశ్వరం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత

21-07-2024 11:24:48 AM

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. త్రివేణి సంగమం తీరం వద్ద 9 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల పై నుంచి వరద  కొనసాగుతుంది. గోదావరి తీరం వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి 3,06,510 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. అన్నారం సరస్వతి బ్యారేజీ కి 16,850 క్యూసెక్కుల వరదరావడంతో 66 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు అధికారులు నీరును వదులుతున్నారు.