హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ పద్మశాలి కాలనీలోని సంజీవ హనుమాన్ దేవాలయంలో సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి, రంగనాయక స్వామిల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదాదేవి విగ్రహాన్ని పద్మశాలి కాలనీ నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠాగోపాల్(MLA Muta Gopal), పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పద్మశాలి సంఘం రాష్ట్ర కోశాధికారి బింగి నవీన్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని పల్లకిలో ఊరేగించడంతో పాటు మంగళ హారతులతో స్వాగతం పలికారు. స్వామివారి భక్తి గీతాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి, కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షులు కృష్ణ సలహాదారులు సుదర్శన్, పుండరీకం, సీత, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.