calender_icon.png 14 March, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదా గోవింద గీతం

18-12-2024 12:00:00 AM

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్ (తమిళ)


మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు

అంతలోనె ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు

నోము స్నానాల పునీతమై త్రివిక్రముని నోరార వేడుదాము

నెలమూడు వానల, వెన్నెల సోనల వ్రేపల్లె సస్యశ్యామలంబు

ఎదిగిన పైరుల నిండిన జలాల త్రుళ్లిపడు మీన సంచయంబు

తెలుపు కలువ పూల తెలవారుదాక నిదిరుంచు తుమ్మెదలు

కృష్ణువేణువు తాకి సేపులెగసి గోవులిచ్చును క్షీర కుంభవృష్టి

సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము జేయ సీమంతులార.(తెలుగు)