calender_icon.png 17 January, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాడ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం

17-01-2025 12:41:24 AM

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న నాలుగో సినిమా ‘బ్రహ్మ ఆనందం’. బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజాగౌతమ్ ప్రధాన పాత్రల్లో నటి స్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లు. డెబ్యూ డైరెక్టర్ ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుం ది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను లాంచ్ ఈవెంట్‌ను గురువారం హైదరాబాద్‌లో ఏర్పా టు చేశా రు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘నే ను సినిమాలు చేయడం లేదని ఈమధ్య కొందరు అంటున్నారు. దీనికి కారణం నా వయసు. ఇం తకుముందు చేసినట్టు ఇప్పు డు చే యాలంటే కుదరదు. ఇంతకుముందు యాక్టివ్ గా చేసేవాడిని. ఇప్పుడు అలా లేదు. అందుకే సినిమాలు తగ్గిం చాను. అంతేగానీ అవ కా శలు రాకనో.. చేయలేకనో కాదు.. 30 ఇయ ర్స్ ఇండస్ట్రీ అన్న పదాలు మెడలో తగిలించుకోవడానికే పనికొస్తాయి.

ఎప్పటి కప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుం టూ ఉండాలి. వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. సెట్‌లో యాక్టింగ్ చేసేటప్పు డే నాకు నవ్వొచ్చేది. నా లెగసీని కంటి న్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు’ అన్నా రు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం అంటేనే కింగ్ ఆఫ్ కామెడీ. గాడ్ ఆఫ్ కామెడీ. ఆయనతో షూటింగ్ సరదాగా ఉంటుంది’ అని చెప్పారు. రాజా గౌతమ్ మాట్లాడుతూ.. ‘మా నాన్న గారితో ఇలా ఈ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ మా ట్లాడుతూ.. ‘బ్రహ్మానందం గారు లేకపోతే ఈ చిత్రం లేదు.. నేను లేను’ అన్నారు. కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.