calender_icon.png 15 January, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరేళ్ల చిన్నారిపై మేకల కాపరి అఘాయిత్యం..!

08-08-2024 02:23:40 PM

ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు

నిందితుడు గద్వాల జిల్లా వాసిగా గుర్తింపు

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై మేకల కాపరి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ ప్రాంతంలోని ఓ కాలనీలో నివాసముంటున్న బుడగ జంగాల దళిత బాలిక రెండవ తరగతి చదువుతోంది. పాఠశాల నుంచి తిరిగి ఇంటికి రావడంతో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మేకల కాపరి ఇంట్లోనే ఈ దారుణానికి వడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై డిఎస్పి బుర్రి శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గద్వాల ప్రాంత మానవపాడు మండలానికి చెందిన నరసింహగా (45) పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.