12-03-2025 01:40:01 AM
పోస్టల్ అధికారుల చేతివాటం..?
హుజూర్ నగర్, మార్చి 11 : పింఛన్ ల లో గోల్ మాల్ చేసి పోస్టల్ అధికారుల చేతివాటం ప్రదర్శిస్తున్న సంఘటన సూర్యాపేట జిల్లామేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది. వివరాలలోకి వెళితే ఎస్ కుమార్ పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పేరు మీద వస్తున్న వృద్ధాప్య పింఛన్ ను తొలగించకుండా యధావిధిగా తీసుకుంటున్నట్లుసమాచారం.
ఈ విషయం తెలుసుకున్న అతని భార్య తమకు డబ్బులు ఇవ్వాలని పట్టు పట్టడంతో అధికారులు నిరాకరించారు.ఈ విషయమై ఆమె పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.పది నెలల డబ్బులు ప్రభుత్వానికి జమ చేయకుండా అతని భార్యకు కూడా ఇవ్వకుండా అధికారులే నొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి. చివరికి పెద్ద మనుషులు, రాజకీయ నాయకుల వద్ద వారు పంచాయతీ పెట్టి ఒక తీర్మానం చేసినట్లు సమాచారం.
ఇలాంటి పింఛన్లు ఇంకా చాలా ఉన్నట్లు పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మంత్రి ఇలాకాలో పోస్టల్ అధికారుల మొండి ధైర్యంతో వృద్ధప్య పెన్షన్లు గోల్ మాల్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ అధికారులు చూసి చూడన్నట్లు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది.
ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. సంబంధిత పింఛన్ల పంపిణీదారున్ని సంప్రదించ డానికి ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు.ఈ ఘటన పై పోస్టల్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది.