95 మద్యం బాటిళ్ల స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవా నుంచి నగరానికి అనుమతికి మించి మద్యం దిగుమతి చేస్తున్న యువకులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీ సులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరానికి చెందిన కొందరు యువకులు ఇటీవల మద్యం కొనుగోలుకు గోవా వెళ్లారు. కొనుగోళ్ల అనం తరం తిరుగు ప్రయాణంలో వాస్కోడిగామా రైలులో హైదరాబాద్‌కు వస్తుండగా.. విశ్వసనీయ సమా చారం మేరకు శనివారం తెల్లవారుజామున వికారాబాద్ ఎక్సైజ్ సూ పరింటెండెంట్ విజయభాస్కర్, డీటీఎఫ్, ఎక్సైజ్ ఎస్సైలు ప్రేమ్ రెడ్డి, వీరాంజనేయులు రైలులో తనిఖీనిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.లక్ష విలువైన 95 మద్యం బాటిళ్లనుస్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.